ఉప్పెన స్పెషల్ షో చూసి బన్నీ రెస్పాన్స్ ఏంటంటే!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సినిమా సాధించిన వసూళ్లు అందరినీ విస్తుపోయేలా చేసాయి. ఏకంగా 50 కోట్ల షేర్ ను అందుకుంది ఈ చిత్రం. మొత్తంగా దాదాపు 25 కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది.

ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఉప్పెన చిత్రాన్ని చూసి మెచ్చుకున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేరాడు. అల్లు అర్జున్ కోసం మైత్రి మూవీస్ సంస్థ స్పెషల్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేయించింది. వైష్ణవ్ తేజ్, మైత్రి మూవీస్, దర్శకుడు బుచ్చి బాబులతో కలిసి సినిమా చూసిన అల్లు అర్జున్ కు ఉప్పెన బాగా నచ్చేసింది.

సినిమా యూనిట్ ను పేరుపేరునా కొనియాడారు. ముఖ్యంగా కొత్తవాళ్ళైనా హీరో, హీరోయిన్లు బాగా చేసారని మెచ్చుకున్నారు. అలాగే విజయ్ సేతుపతి నటనను కూడా పొగిడేశారు. మొత్తంగా ఉప్పెన పెద్ద హిట్ అవ్వడంతో టీమ్ ను అభినందించారు.