బాహుబలి రైటర్ తో ప్లాప్ హీరో సినిమా

నటుడు నవదీప్ చాలా ఏళ్ల నుండి సినిమాల్లో ఉంటున్నా కానీ కెరీర్ లో పైకి రాలేదు. హీరోగా ఎంచుకున్న సినిమాల తప్పిదాల కారణంగా చాలా త్వరగానే క్యారెక్టర్ నటుడిగా మారిపోయాడు నవదీప్. ఇటీవలే కామెడీ షోస్ కు జడ్జిగా వ్యవహరించిన నవదీప్ ఇప్పుడు ఎక్కడ చూసినా గుబురు గెడ్డంతో కనిపిస్తున్నాడు. దీని వెనకాల కథ ఏంటని నవదీప్ నే అడిగితే ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

“బాహుబలి రైటర్ తో నేను ఒక సినిమా చేయబోతున్నాను. విజయేంద్ర ప్రసాద్ టీమ్ నుండి వచ్చిన ఒక కథ డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఒక ఫాంటసీ లవ్ స్టోరీ. ఈ నెల 15 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మేఘాలయలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుగుతుంది. రెండేళ్ల నుండి ఈ సినిమాపై వర్క్ చేస్తున్నాం. కచ్చితంగా నా కెరీర్ లో సూపర్బ్ హిట్ అవుతుంది” అని నవదీప్ వెల్లడించాడు.