థమన్ పై గుస్సా అవుతోన్నమహేష్ ఫ్యాన్స్, కారణమేంటంటే?

ప్రస్తుతం ఎస్ ఎస్ థమన్ సూపర్ ఫామ్ లో కొనసాగుతోన్న విషయం తెల్సిందే. దాదాపు అన్ని టాప్ చిత్రాలకు థమన్ పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో థమన్ ఏడేళ్ల తర్వాత పనిచేస్తున్నాడు. ఆగడు తర్వాత థమన్ మహేష్ కు చేస్తోన్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.

ఇదిలా ఉంటే సర్కారు వారి పాట మోషన్ పోస్టర్ కు థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే అదే మ్యూజిక్ ఇప్పుడు కన్నడలో చేస్తోన్న పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న సినిమాలో ఒక సాంగ్ కు కూడా దాదాపు అదే మ్యూజిక్ ఇచ్చాడు థమన్.

ఈ కారణంగా థమన్ పై మహేష్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారట. అయితే మరి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చి మహేష్ ఫ్యాన్స్ ను థమన్ శాంతిపరుస్తాడేమో చూడాలి.