పరిటాల శ్రీరామ్ కోడ్ ఉల్లంఘన..! కేసు నమోదు చేసిన పోలీసులు

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ధర్మవరంలో మాజీ మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు శ్రీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా శ్రీరామ్ ప్రచారం నిర్వహించారని ఆయనపై పోలీసు కేసు నమోదైంది. స్థానిక 10వ వార్డులో ప్రచారం సందర్భంగా శ్రీరామ్ నిబంధనలను ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్థానిక జామియా మసీదు వద్ద ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆయనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసే నమోదు చేశారు. శ్రీరామ్ తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. అంతకుముందు 1,2,3 వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు పరిటాల శ్రీరామ్. ప్రధాన వార్డుల్లో మాజీ మంత్రి పరిటాల సునీత ప్రచారం నిర్వహించారు.