14 కోట్ల రెమ్యునరేషన్ కోట్ చేస్తోన్న నాని

నేచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోలలో ఒకడు. అతని అన్ని సినిమాలు టాక్ సంగతి ఎలా ఉన్నా కానీ మినిమమ్ గ్యారంటీ వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా 10-12 కోట్ల రూపాయల దాకా ఉండే నాని రెమ్యునరేషన్ ఇప్పుడు మరింత పెరిగిందట. తన వద్దకు వచ్చే నిర్మాతలకు 14 కోట్ల రూపాయలను కోట్ చేస్తున్నాడట నాని.

గతేడాది లాక్ డౌన్ హీరోలకు చాలా హెల్ప్ అయింది. వివిధ ఓటిటి మాధ్యమాల ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఫాలోయింగ్ బానే వచ్చింది. అలాగే డిజిటల్ రైట్స్ రూపంలో నిర్మాతలకు కొత్త ఆదాయ మార్గం దొరికింది. కాబట్టి సినిమా టాక్ తో సంబంధం లేకపోయినా సాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అంటూ నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అవుతోంది. అందుకే హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ ను పెంచేస్తున్నారు. నాని ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.