ఒక్కోసారి ఒక్కో హీరో సినిమాల్లో మరో హీరో రెఫెరెన్స్ అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా ఇలా జరిగినప్పుడు వేరే హీరోల ఫ్యాన్స్ చాలా సంతోషిస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశమే అక్కినేని నాగ చైతన్య సినిమాలో ఉండనుంది. అక్కినేని నాగ చైతన్య లవ్ స్టోరీలో నటించిన విషయం తెల్సిందే. ఏప్రిల్ 16న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. థాంక్యూ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఆసక్తికర అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు వీరాభిమానిగా కనిపిస్తాడట. ప్రస్తుతం నాగ చైతన్య థియేటర్ వద్ద మహేష్ కటౌట్ కు పాలాభిషేకం చేసే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఈ విషయం తెల్సి మహేష్ అభిమానులు ఆనందిస్తున్నారు. దీనివల్ల ఈ చిత్రానికి ఇప్పుడు బజ్ మరింత పెరిగింది.