అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ గురించి గత కొంత కాలంగా వార్తలు బాగా వస్తున్నాయి. బాలీవుడ్ టాప్ హీరో ఆమిర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడని రూమర్స్ బలంగా ఉన్నాయి. అయితే ఇది నిజమో కాదో అన్న విషయాన్ని పక్కనపెడితే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఫరా ఖాన్ తో నాగ చైతన్య సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఫరా ఖాన్ “పాతికేళ్ల క్రితం నాగార్జునకు కొరియోగ్రాఫ్ చేశాను. అప్పటినుండి తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళబ్బాయితో పనిచేస్తున్నాను” అని ఫరా ఖాన్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.
నాగ చైతన్యతో ఆమె టివి కమర్షియల్ ను తెరకెక్కిస్తోంది. సినిమాల విషయానికొస్తే లవ్ స్టోరీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోన్న చైతన్య, థాంక్యూ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.