నరేష్ తో లిప్ లాక్ గురించి ఏడేళ్ల తర్వాత పెదవి విప్పిన ఆమని

ఆమని సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. రీసెంట్ గా ఆమె శ్రీకారం సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించింది. ఆమె కార్తికేయ తల్లిగా నటించిన చావు కబురు చల్లగా చిత్రం ఈ నెల 19న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమని వరసగా ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా 2014లో వచ్చిన చందమామ కథలు, ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశంలో నరేష్ తో చేసిన లిప్ లాక్ సన్నివేశం గురించి స్పందించారు ఆమని. కథ డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశంలో నటించడానికి తనకు అభ్యంతరం లేదని తెలియజేసారు ఆమని. ఆ సన్నివేశంలో నరేష్ కూడా ఎంతో ధైర్యంగా నటించారని ఆమె తెలిపారు.

ఇక సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాలో జగపతి బాబు భార్య రోల్ లో నటిస్తున్నట్లు రివీల్ చేసారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో అఖిల్ తల్లిగా నటించినట్లు రివీల్ చేసారు ఆమె.