కళ్యాణ వైభోగమే సీరియల్ కు మంచి ఆధరణ ఉంది. వెయ్యి ఎపిసోడ్ లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ద్వారా వీజే సన్నీ మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. హీరోగా ఆయన ఈ సీరియల్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. కళ్యాణ వైభోగమే సీరియల్ నుండి తాజాగా ఆయన తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. స్వయంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తాను ఆ సీరియల్ నుండి వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నాను. అంతే తప్ప ఆ సీరియల్ యూనిట్ సభ్యులతో నాకు ఎలాంటి విభేదాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కళ్యాణ వైభోగమే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు అంతగా దగ్గర అయిన సన్నీ ఎందుకు సీరియల్ ను మద్యలో వదిలేస్తున్నాడు అంటూ పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. విభేదాల కారణంగా అంటూ కొందరు మరి కొన్ని కారణాల వల్ల అంటూ మరి కొందరు చేశారు. కాని తాను మాత్రం ఎలాంటి విభేదాలు లేకుండా ఒప్పందం పూర్తి అవ్వడం వల్ల మంచి వాతావరణం నుండే సీరియల్ నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు.