దేశాన్ని కుదిపేసిన నెపోటిజంపై స్పందించిన నాగ్

అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ సినిమా వైల్డ్ డాగ్. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నాగ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా దేశాన్ని కుదిపేసిన నెపోటిజం అంశంపై వచ్చిన ప్రశ్నకు నాగార్జున స్పందించారు.

“నెపోటిజం అనేది చాలా తప్పుగా వాడుతున్నారు. పబ్లిక్ డబ్బులతో నడిపే సంస్థలలో వారసులకు, బంధువులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని నెపోటిజం అంటారు. ప్రైవేట్ సెక్టార్ కు చెందిన వ్యక్తులకు ఇది స్పందించదు. నాన్న గారు సినిమాల్లో రాణించారు. మమ్మల్ని బాగా చదివించారు. నేను సినిమాల్లోకి వస్తానని పట్టుబట్టాను. తీసుకొచ్చారు. నా పిల్లలకు కూడా ఈ రంగంలో ఆసక్తి ఉంది. వాళ్ళను తీసుకొచ్చాను. కొడుకులు అంటే ప్రేమ ఎవరికి ఉండదు. వాళ్ళకోసం కష్టపడతాం. సపోర్ట్ ఇస్తాం. అలాగే బయటవాళ్ళలో టాలెంట్ ఉంది అనిపిస్తే తప్పకుండా అవకాశాలు ఇస్తాం. ఇంతకు మించి నెపోటిజం గురించి ఏం చెప్పలేను” అని నాగార్జున అన్నాడు.