ఉగ్రరూపం.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రేపు తన పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా తను నటిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ నుండి ఈరోజు ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీత రామరాజు పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. గతేడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వీడియో టీజర్ ను విడుదల చేసారు. అయితే ఈసారి పోస్టర్ తోనే సరిపెట్టారు.

ఇక ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో రామ్ చరణ్ స్టన్నింగ్ గా ఉన్నాడు. అల్లూరి సీతారామరాజు గెటప్ లో పొడుగు జుట్టు, విల్లు చేతబట్టి ఆకాశంలోకి సంధిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా లీడ్ రోల్ ను పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.