‘వైల్డ్ డాగ్’ లో మా ఇద్దరి కలయిక వెరీ ఇంట్రస్టింగ్ః హీరోయిన్


కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ జోరు పెంచింది యూనిట్. ఇప్పటికే నాగార్జున ప్రచారంలో దూసుకుపోతున్నారు. గంగవ్వతో ఇంటర్వ్వూ ప్లాన్ చేసి సినిమాను చర్చల్లో ఉంచారు. ఇప్పుడు సినిమా హీరోయిన్ కూడా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైల్డ్ డాగ్ గురించి తన కెరీర్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నారు సయామీ ఖేర్.

నాగార్జున ‘గీతాంజలి’ తనకెంతో ఇష్టమన్న సయామీ.. వైల్డ్ డాగ్ లో ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉందన్నారు. అయితే.. ఈ సినిమాకు ముందు వరకు ఎప్పుడూ నాగ్ ను కలవలేదని చెప్పారు. ఇందులో తాను ‘రా’ ఏజెంట్ ఆర్యా పండిట్ పాత్రలో.. నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ క్యారెక్టర్లో నటించామని మేమిద్దరం ఎందుకు కలవాల్సి వచ్చిందనేది ఆసక్తకర అంశమని చెప్పారు.

ముంబైలో షూటింగ్ స్పాట్ లోకి వెళ్లిన తర్వాత నాగార్జున గారితో కంఫర్టబుల్ గా మూవ్ అయ్యానని చెప్పారు సయామీ. ఆయన చాలా కూల్ గా ఉంటారని అందరితోనూ ఈజీగా కలిసిపోతారని చెప్పారు. హైదరాబాద్ లో షూటింగ్ సమయంలో వాళ్ల ఇంటినుంచే బిర్యానీ వచ్చిందని చాలా హ్యాపీగా షూటింగ్ సాగిపోయిందని తెలిపారు.

సాయిధరమ్ తేజ్ ‘రేయ్’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సయామీ ఖేర్.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వైల్డ్ డాగ్ తో వస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ అయితే మరిన్ని చిత్రాల్లో నటించాలని ఆశపడుతున్నారు. మరి ఈ చిత్రం తన ఆశలు ఎంత మేర సక్సెస్ చేస్తుందో చూడాలి.