పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ – బాక్స్ ఆఫీస్ బద్దలైపోద్ది.!

దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఏప్రిల్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని కంప్లీట్ కోర్ట్ డ్రామా అనే యాంగిల్ లో కట్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ ని పవర్ఫుల్ గా చూపించిన కొన్ని సీన్స్ ఫాన్స్ ఫిదా చేసుకునేలా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడం వలన కచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయే కలెక్షన్స్ వసూలు చేస్తుందని ట్రైలర్ చూసాక ఫిక్స్ అయ్యారు.