టీఆర్‌ఎస్‌ కొత్త ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి బ్యాక్ టు బ్యాక్‌ కష్టాలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి ఇటీవలే టీఆర్‌ఎస్ తరపున పట్టభద్రుల ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయం తెల్సిందే. ఆమె ఆ ఆనందంను పొందుతున్న సమయంలోనే బ్యాక్ టు బ్యాక్ కష్టాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆమె కారు ప్రమాదంకు గురైంది. ఆమె కారులో ఉన్న సమయంలోనే యాక్సిడెంట్ అయ్యింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఆమె కారు గేటుకు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఆ ప్రమాదం నుండి తేరుకుంటున్న సమయంలోనే సురభి వాణిదేవి గారు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవ్వడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయారు. ఆమె కరోనా బారిన పడ్డట్లుగా అధికారికంగా వెళ్లడి అయ్యింది. సురభి వాణి దేవి కి ఎమ్మెల్సీ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇలా కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో ఆమె సన్నిహితులు మరియు టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.