పిల్లలు ఆ విషయంతో నాతో గొడవ పడుతూనే ఉంటారు: రేణూ దేశాయ్

పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ విడిపోయిన తర్వాత పిల్లలు అకీరా నందన్, ఆద్య బాధ్యతలు రేణూ చూస్తున్నారు. గతంలో పూణెలో ఉండే రేణు ఇటివల హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. పలు వెబ్ సిరీస్, పలు సీరియల్స్ లో నటించే అవకాశాలు రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే.. ఇంట్లో అకీరా, ఆద్య చేసే అల్లరి గురించి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు పోస్ట్ చేస్తూ ఉంటారు. పిల్లలకు తనకు మధ్య జరిగే గొడవను కూడా రీసెంట్ గా చెప్పుకొచ్చారు.

ఇంట్లో ప్రతిరోజూ సాయంత్రం 7గంటలకు పూజ చేయాలనేది రేణు నియమంగా పెట్టుకున్నారట. పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ పూజకు హాజరు కావాలని ఆమె ఆర్డర్ వేశారట. అయితే.. ప్రతిరోజూ ఇలా రామంటూ గొడవ చేస్తారట అకీరా, ఆద్య. పూజ అయిన వెంటనే డిన్నర్ చేసి త్వరగా నిద్రపోవాలని చెప్తారట. అయితే.. వారు ఈ విషయంతో తనతో గొడవ పడుతూ ఉంటారని చెప్పుకొచ్చారు రేణు.