టాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సినిమాను అన్ని ఏరియాల్లో అమ్మేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సినిమా కు సంబంధించిన నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ ను భారీ మొత్తానికి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
బాలీవుడ్ లో ఇటీవల బడా సినిమాలను అందిస్తున్న వారు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రికార్డు స్థాయి రేట్ ను కోట్ చేసినట్లుగా చెబుతున్నారు. అద్బుతమైన ఈ సినిమా ను తప్పకుండా ఉత్తరాదిన భారీ ఎత్తున విడుదల చేస్తామని వారు చెబుతున్నారు. బాహుబలి 2 ను మించి ఈ సినిమాను అక్కడ విడుదల చేసేలా ఇప్పటి నుండే పెన్ ఇండియా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అక్టోబర్ లో ఈ సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. నార్త్ ఇండియా బిజినెస్ పూర్తి అవ్వడంతో ఇక కీలకమైన సౌత్ ఇండియన్ స్టేట్స్ లో బిజినెస్ జరగాల్సి ఉంది.
https://twitter.com/PenMovies/status/1377494724450295808