‘ఆర్‌ఆర్‌ఆర్‌’ హీరోయిన్‌ కు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ కి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. కొన్ని రోజుల క్రితం ఈమె నటిస్తున్న చిత్రం యొక్క యూనిట్‌ సభ్యుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో స్వీయ నిర్భందంలోకి వెళ్లిన ఆలియాకు కరోనా నెగటివ్‌ అంటూ వచ్చింది. దాంతో ఆమె మళ్లీ షూటింగ్‌ లకు జాయిన్‌ అయ్యింది. ఇటీవల మళ్లీ ఆమె స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా ఈసారి పాజిటివ్‌ వచ్చింది.

కరోనా పాజిటివ్‌ అనే విషయాన్ని ఆమె తెలియజేసింది. గత మూడు నాలుగు రోజులుగా తనను కలిసిన వారికి ఆమె పరీక్షలు చేయించుకోవాలంటూ సూచించింది. ఆలియా భట్ ఆర్‌ ఆర్‌ ఆర్‌ చివరి షెడ్యూల్‌ లో పాల్గొనాల్సి ఉంది. ఆమె కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడం తో ఆమె రాక కష్టమే అని తేలిపోయింది. మరి ఇప్పుడు జక్కన్న ఏం చేస్తాడు అనేది ఆసక్తిగా మారింది. ఆర్‌ ఆర్‌ ఆర్‌ లో ఆలియా భట్‌ సీత పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. రామ్‌ చరణ్‌ కు జోడీగా ఈ అమ్మడు నటిస్తుంది. ఆలియా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడం వల్ల ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాకు సంబంధించి షూటింగ్‌ ఆలస్యం అయ్యేలా ఉందని అంటున్నారు. మరి విడుదల తేదీ ఏమైనా ఎఫెక్ట్‌ అవుతుందా అనేది చూడాలి.