ఏ సినిమా తీసినా పర్ఫెక్షన్ తో తెరకెక్కించే దర్శకుడిగా రాజమౌళికి పేరు. అందుకే ఆయన తీసే సినిమా ఏళ్లకు ఏళ్లు టైమ్ తీసుకుంటాయి. బాహుబలి సిరీస్ సినిమాలు ఐదేళ్లు టైమ్ పట్టింది. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పై వచ్చే సన్నివేశంపై రాజమౌళి కన్విన్స్ కాలేదని తెలుస్తోంది.
దీంతో ఈ సన్నివేశాన్ని మూడుసార్లు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ గా ఎన్టీఆర్ పై తెరకెక్కిస్తున్న ఈ సన్నివేశంపై రాజమౌళి సంతృప్తిగా ఫీల్ అవలేదట. దీంతో ఒకటి కాదు.. రెండు కాదు.. మూడుసార్లు తెరకెక్కించాక ఔట్ పుట్ బాగుందని అనిపించాక షాట్ ఓకే అని చెప్పినట్టు ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. ఇటువంటి విషయాల్లో రాజమౌళి ఖర్చుకు కూడా వెనుకాడడనేది తెలిసిందే.