పవర్ స్టార్ వకీల్ సాబ్ పై సూపర్ స్టార్ రివ్యూ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం పవర్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ హిట్ చిత్రం పింక్ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో వకీల్ సాబ్ గా తెరకెక్కింది. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ దిశగా సాగుతోంది.

మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అటు అభిమానులు, ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు, వకీల్ సాబ్ కు రివ్యూ ఇచ్చాడు.

“టాప్ ఫామ్ పవన్ కళ్యాణ్, పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ నిజంగా బ్రిలియంట్. నివేతా థామస్, అంజలి, అనన్య హార్ట్ టచింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ టాప్ లెవెల్. టీమ్ మొత్తానికి అభినందనలు” అని ట్వీట్ చేసాడు మహేష్.