పవన్ గురించి మాట్లాడితే నన్నే తిడతారు: రేణు దేశాయ్

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విశేషాలు తెలుపుతూ ఫాలోయర్లతో టచ్ లో ఉంటుంది. రీసెంట్ గా తన కూతురు ఆద్యతో కలిసి రేణు దేశాయ్ ఇన్స్టా లైవ్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అభిమానులు రేణు దేశాయ్ ను పలు రకాల ప్రశ్నలు అడిగారు.

ఒక నెటిజెన్, పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడగలరా అని అడిగితే దానికి రేణు దేశాయ్, “ఏమని మాట్లాడమంటారు? మీరే పవన్ గురించి అడుగుతారు. నేను ఏదైనా సమాధానమిస్తే మీరే ఎప్పుడూ పవన్ గురించి మాట్లాడుతుంది ఏంటి అని నన్నే తిడతారు. అందుకే లైవ్ కు రావాలంటే కష్టంగా ఉంటోంది” అని తెలిపింది.

ఇక అకీరా ఎందుకని సామజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండడు అని అడిగితే, అకీరాకు సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు ఉన్నాయి. కాకపోతే అవి ప్రైవేట్ లో ఉంటాయి. ఆ విషయంలో అకీరాను ఇబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు అని స్పందించింది.