మోనాల్‌ ను ఏడిపించిన ఓంకార్‌ అన్నయ్య

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు రియాల్టీ షో లను రుచి చూపించింది ఓంకార్. ఆట డాన్స్ షో తో ఓంకార్‌ తనదైన మార్క్‌ షో లను తయారు చేయడం జరిగింది. తన షోల్లో కంటెస్టెంట్స్ మద్య గొడవ పెట్టడం, ఏడిపించడం, జడ్జ్‌ ల మద్య గొడవలు జరిగేలా చేయడం ఓంకార్ కు తెలిసిన విద్య. ఎప్పుడు కూడా ఓంకార్‌ షో చేస్తున్నాడు అంటే అందులో గొడవలు చాలా కామన్. వాటిని రియల్‌ గొడవలు అని నిరూపించేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తాడు. కాని ఆ గొడవలు అన్ని కూడా స్క్రిప్ట్‌ అని చాలా సందర్బాల్లో నిరూపితం అయ్యింది.

తాజాగా డాన్స్ ప్లస్‌ షో లో మోనాల్‌ ను ఏడిపించడంతో పాటు జడ్జ్‌ లతో గొడవ పడేలా చేశాడు. మోనాల్‌ మెంటర్ గా వ్యవహరిస్తున్న టీమ్‌ ఎలిమినేట్‌ అవ్వడం జరిగింది. దాంతో మోజాల్ కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో జడ్జ్‌ ల నిర్ణయాన్ని ఆమె తప్పుబట్టింది. జడ్జ్ ల నిర్ణయంను తప్పుబడుతూ మోనాల్‌ విమర్శలు చేసిన సమయంలో యష్‌ మాస్టర్‌ స్పందించాడు. అప్పుడు బాబా బాస్కర్‌ మాస్టర్ కూడా స్పందించాడు. వారిద్దరి తీరును కూడా మోనాల్‌ మరోసారి తప్పుబట్టింది. మొత్తానికి మోనాల్‌ తో మళ్లీ ఓంకార్‌ కన్నీరు పెట్టించాడు.