అక్కినేని హీరో సుమంత్ చేస్తున్న కొత్త సినిమా ‘అనగనగా ఓ రౌడీ’. ఈ సినిమా చిత్రీకరణ ముగించారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను వైజాగ్ లో ప్రారంభించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇంతలోనే చివరి షెడ్యూల్ ను ముగించినట్లుగా హీరో సుమంత్ ప్రకటించాడు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఏ సమయంలో అయినా సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
సినిమా షూటింగ్ ముగిసిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు విడుదల విషయమై చర్చలు జరుపుతున్నారు. సినిమాకు ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయని కాని థియేటర్ రిలీజ్ కు మాత్రమే వెళ్లాలని వారు భావిస్తున్నారట. మొత్తానికి షూటింగ్ ను ముగించుకున్న అనగనగా ఓ రౌడీ సినిమా పై సుమంత్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా లో వాల్తేరు శీను గా సుమంత్ రౌడీ పాత్రలో కనిపించబోతున్నడు. ఇప్పటికే విడుదల అయిన లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.