కరోనా కరాళ నృత్యం చేస్తోంది. దేశ వ్యాప్తంగా లక్షల కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో పలువురు సినీ ప్రముఖులు కూడా కరోనాతో మృతి చెందుతున్నారు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు లెజెండ్స్ మృతి చెందగా తాజాగా సూపర్ హిట్ చిత్రం గజిని నిర్మాత సేలం చంద్రశేఖర్ కరోనాతో మృతి చెందారు. ఆయన తమిళ సినీ ఇండస్ట్రీలో సుపరిచితుడు. ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన మృతి అందరికి షాకింగ్ గా ఉంది.
59 ఏళ్ల సేలం ఇటీవల కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయనకు మొదట ఊపిరికి సంబంధించిన సమస్య ఏర్పడింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం మెల్ల మెల్లగా క్షీణించింది. ఆ తర్వాత ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచారు. చివరకు ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మృతి చెందినట్లుగా వైధ్యులు పేర్కొన్నారు. కొంత కాలంగా నిర్మాణంకు దూరంగా ఉన్నా కూడా ఇండస్ట్రీలో ఆయన పరిచయాలు మాత్రం కొనసాగుతూ వచ్చాయి.