కరోనా వైరస్ కారణంగా మనుషుల్లోనూ దేవుళ్ళు ఉంటారని తెలిసొచ్చింది. ముఖ్యంగా సోను సూద్ ఈ విషయంలో చాలా మందికే దేవుడయ్యాడు. మొదటి వేవ్ అప్పుడు వలస కార్మికులకు, విద్యార్థులకు బాసటగా నిలిచిన సోను సూద్ సెకండ్ వేవ్ సమయంలోనూ తన సేవలను విస్తృతం చేసాడు.
హాస్పిటల్ బెడ్, ఆక్సిజన్, మందులు, డబ్బు సహాయం… ఇలా ఏది కావాలని అడిగినా నిమిషాల్లో అరెంజ్ చేస్తున్నాడు సోను సూద్. దీంతో నిజంగానే అందరికీ దేవుడిగా మారాడు. ఈ నేపథ్యంలో సోను సూద్ కు విలేఖరుల నుండి ఒక ఆసక్తికర సమాధానం ఎదురైంది.
ప్రజలు మిమ్మల్ని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు, దానికి మీ సమాధానమేంటి అని ప్రశ్నించగా నేను చేసిన సేవలకు వారు అలా కోరుకోవడంలో తప్పు లేదు. అయితే నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. నేను కామన్ మ్యాన్ గానే ప్రజలకు సేవ అందించాలనుకుంటున్నాను అని సింపుల్ గా తేల్చేసాడు.