పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని దేవ దేవమ్ సాంగ్ కు శివ శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందించారు. ఆ సమయంలో జరిగిన ఫన్నీ సంఘటన గురించి ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సాంగ్ కొరియోగ్రఫీ సందర్బంగా పవన్ ను కలిశాను. అంతుకు ముందు చాలా ఏళ్ల క్రితం పవన్ ను కలిశాను. చాలా గ్యాప్ తర్వాత పవన్ ను కలిసిన వెంటనే హగ్ చేసుకున్నాడు. ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా ప్రశ్నించారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో నా వద్దకు వచ్చి మాట్లాడాడు.
ఒక రోజు నన్ను గిల్లి ముద్దు పెట్టి ఈ వయసులో కూడా ఇంతగా డాన్స్ స్టెప్పులతో అదరగొడుతున్నారు కదా అంటూ కితాబిచ్చారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ లోని హాస్య చతురతను చూశాను. పవన్ కళ్యాణ్ తో వర్క్ చేసిన అనుభవంను గుర్తు చేసుకుని కొరియోగ్రఫర్ శివ శంకర్ మాస్టర్ మురిసి పోయాడు. పవన్ తో ఎవరు చేసినా కూడా వారు జీవితాంతం ఆ అనుభవంను గుర్తు ఉంచుకుంటారు. ఆయన చాలా ప్రత్యేకమైన పీస్ అంటూ పవన్ తో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు.