సంజనా గల్రాని.. టాలీవుడ్ లో పెద్దగా తెలియని పేరు. బుజ్జిగాడుతో పాటు ఒకట్రెండు సినిమాల్లో నటించింది. అయితే కన్నడలో మాత్రం సంజన బాగానే సినిమాలు చేసింది. అక్కడ సినిమాలతో పాటు కాంట్రవర్సీలతో సంజనా ఫేమస్ అయింది.
ఇదిలా ఉంటే 2019లో జరిగిన ఒక సంఘటన సంజనాను ఇప్పుడు ఇబందుల్లో నెట్టింది. 2019 క్రిస్ట్మస్ సమయంలో నిర్మాత వందన జైన్ ముఖంపై సంజనా విస్కీతో దాడి చేసిందట. ఇద్దరికీ జరిగిన వాగ్వాదంలో జైన్ ముఖంపై విస్కీ పోయడంతో ఆమె కళ్ళల్లోకి విస్కీ వెళ్లి చాలా సీరియస్ అయిందట. కళ్ళల్లోంచి మంట రావడంతో జైన్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని అటు నుండి కబ్బన్ పార్క్ పోలీస్ వద్ద కేసును ఫైల్ చేసిందట.
అయితే లాక్ డౌన్ రెగ్యులేషన్స్ కారణంగా ఈ కేసు వాయిదా పడుతూ వచ్చి పోలీసులు పలు సెక్షన్ల కింద సంజనాపై కేసు నమోదు చేసారు.