పవన్ కళ్యాణ్.. ఇంకెన్ని రోజులు అక్కడే ఉంటారో తెలుసా?

పవన్‌ కళ్యాణ్ గత నెలలో కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పాటు తీవ్రమైన జ్వరంతో బాధ పడ్డాడు. దాంతో అత్యున్నత స్థాయి వైధ్యంను పవన్ కు అందించారు. దాదాపు రెండు వారాల తర్వాత పవన్ వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నాడు అంటూ అధికారికంగా ప్రెస్‌ నోట్‌ వచ్చింది. పవన్‌ కోలుకుని రెండు వారాలు దాటుతుంది. అయినా ఇప్పటి వరకు ఎక్కడ కూడా పవన్ కనిపించడం లేదు. సాదారణంగా అయితే కోలుకున్న వారు వెంటనే బయట తిరిగేస్తున్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరోనాను జయించి హాయిగా ఉన్నారు.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాని పవన్‌ కళ్యాణ్ మాత్రం కరోనాను జయించి వారాలు గడుస్తున్నా ఇంకా బయట కాలు పెట్టకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అంటూ ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు. కరోనా వల్ల మనిషి ఆరోగ్యం క్షీణిస్తుంది. కరోనా నెగటివ్‌ వచ్చిన తర్వాత కూడా కనీసం కొన్ని రోజుల వరకు ఆ ప్రభావం తాలూకు నీరసం ఉంటుంది. ప్రెస్ నోట్‌ లో పవన్‌ కు నీరసంగా ఉందన్నారు. ఆ నీరసం ఇంకా తగ్గలేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోసారి పవన్‌ హెల్త్‌ కు సంబంధించిన అప్ డేట్ కావాలంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.