సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు అయిన మే 31 న ప్రతి ఏడాది కూడా మహేష్ బాబు తాను నటించిన లేదా నటిస్తున్న సినిమాల తాలూకు అప్ డేట్స్ లేదా ఫస్ట్ లుక్ టీజర్ వంటివి ఏదో ఒకటి షేర్ చేస్తూ అభిమానులకు తండ్రి పుట్టిన రోజు కానుక ఇచ్చేవారు. కాని ఈ సారి మాత్రం అప్ డేట్ లేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు. మే 31వ తారీకున సర్కారు వారి పాట టీజర్ అని ఫస్ట్ లుక్ అంటూ అభిమానులు గత నెల రెండు నెలలుగా చర్చించుకుంటున్నారు. కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ సమయంలో సర్కారు వారి పాట ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పారు.
మహేష్ బాబు ఒక నోట్ ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దు. అన్ని అధికారిక ప్రకటనలు కూడా తమ అధికారిక అకౌంట్స్ ద్వారా వస్తాయి అంటూ ఈ సారికి సర్కారు వారి పాట సందడి లేదంటూ క్లారిటీ ఇచ్చారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.