సంగీతంలో ట్రైనింగ్ తీసుకుంటోన్న అకీరా

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినా అది ఒక సెన్సేషన్ అవుతోంది. రీసెంట్ గా ఈరోజు మళ్ళీ అకీరా నందన్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అకీరాతో పాటుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫొటోలో ఉన్నాడు. ముఖ్యంగా అకీరా హైట్ హాట్ టాపిక్ అవుతోంది.

అకీరా ఎప్పుడు సినీ అరంగేట్రం చేస్తాడని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. దాంతో పాటు సంగీతంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సింగింగ్ లో అకీరాకు ఆసక్తి ఉందని సమాచారం. సంగీతం క్లాసెస్ కు అటెండ్ అవుతున్న అకీరా ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కరోనా నుండి కోలుకున్న పవన్ కళ్యాణ్ అకీరా, ఆద్యలను కలుస్తూనే ఉన్నాడు. రేణు దేశాయ్ నుండి విడిపోయినా కానీ పిల్లలకు తండి ప్రేమను పంచుతూ ఉంటాడు.