కరోనా కారణంగా కన్ను మూసిన సీనియర్ నటుడు


కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఇంకా బలంగానే కొనసాగుతోంది. కొన్ని చోట్ల నిబంధనలు సడలించినా కరోనా ప్రమాదమైతే తొలగిపోలేదు. కరోనా వల్ల ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను మనం కోల్పోయాం. రీసెంట్ గా కన్నడ నటుడు సురేష్ చంద్ర కన్నుమూశారు. కరోనా నుండి చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల నుండి చికిత్స కొనసాగినా సురేష్ చంద్ర కోలుకోలేకపోయారు. ఈరోజు పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

చివరిగా 2019లో విడుదలైన కాళిదాస కన్నడ మేష్ట్రు చిత్రంలో కనిపించారు సురేష్ చంద్ర. సురేష్ చంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెలువినా చిత్తారా, ఉగ్రమ్, రానా శైలూ, అప్పయ్య వంటి చిత్రాల్లో నటించారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేసారు.