పవన్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మలయాళీ భామ


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలకు కమిటైన విషయం తెల్సిందే. వకీల్ సాబ్ తర్వాత హరిహర వీర మల్లు, అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్ర రీమేక్స్ తో పవన్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలు పూర్తైన తర్వాత హరీష్ శంకర్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంపై బోలెడంత బజ్ ఉంది.

భారీ అంచనాలు ఇప్పటికే నెలకొన్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ చిత్రంపై పలు రూమర్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంచారి టైటిల్ అనుకుంటున్నట్లు, అలాగే ఈ సినిమాలో మలయాళీ బ్యూటీ మానస రాధాకృష్ణన్ నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

అయితే ఈ రూమర్లపై స్పందించింది మానస. తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నానన్న రూమర్ లో నిజం లేదని ఆమె తెలిపింది. అయితే తనకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది.