ఫ్యాన్సీ ధరకు మేస్ట్రో డిజిటల్ డీల్

యంగ్ హీరో నితిన్ రెండు వరస ప్లాపుల తర్వాత ఈసారి రీమేక్ తో మన ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో అవార్డు విన్నింగ్ ఫిల్మ్ గా నిలిచిన అంధధూన్ చిత్రాన్ని తెలుగులో మేస్ట్రో పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాను నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించింది.

రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక మేస్ట్రో చిత్రాన్ని డైరెక్ట్ డిజిటల్ లో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 40 కోట్ల రూపాయలకు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ డీల్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సంస్థ మేస్ట్రో రిలీజ్ గురించి ప్రకటన చేయనుంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ రీమేక్ లో నభా నటేష్ హీరోయిన్ గా నటించగా తమన్నా నెగటివ్ పాత్రను పోషించింది.