మిథాలిరాజ్‌ బయోపిక్‌ చేతులు మారిందా?

క్రికెట్‌ అనగానే ఇండియన్స్ కు సచిన్‌.. ధోని ఇంకా కొందరి పేర్లు గుర్తుకు వస్తాయి. ఇక ఇండియన్‌ లేడీ క్రికెట్‌ అనగానే చిన్న వారి నుండి పెద్ద వారి వరకు అందరికి తెలిసే పేరు మిథాలిరాజ్. సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ ఆడుతున్న మిథాలి రిటైర్మెంట్‌ కు సిద్దం కాబోతుంది. ఈ సమయంలోనే ఆమె జీవిత కథను వెండి తెరపై ఆవిష్కరించి కోట్ల మందికి ఆదర్శంగా ఆమె జీవితాన్ని చూపించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. హీరోయిన్ తాప్సి ఇప్పటికే మిథాలి పాత్ర కోసం సిద్దం అయ్యింది. క్రికెట్‌ నుండి మొదలుకుని బాడీ బిల్డింగ్‌ వరకు తాప్సి సిద్దంగా ఉంది. శభాష్‌ మిథు టైటిల్ తో ఈ సినిమా రూపొందబోతుంది.

ఈ ప్రతిష్టాత్మక బయోపిక్‌ కు రాహుల్‌ ఢోలాకియా దర్శకత్వం వహించబోతున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. ఆయన తన టీమ్‌ తో స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాడు. కాని ఇప్పుడు ఈ బయోపిక్ బాధ్యతలు బెంగాళి డైరెక్టర్‌ శ్రీజిత్ ముఖర్జీ కి అప్పగించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కథకు ఆయన అయితే తప్పకుండా న్యాయం చేస్తాడనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారట. అందుకే మిథాలి రాజ్‌ బయోపిక్ ను చేతులు మార్చి ఆయనకు ఇచ్చేశారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.