చరణ్‌ – శంకర్‌ ల కాంబో మూవీ కోసం ఇంకో వారం టైమ్‌

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం చేస్తున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ను జులై లో ముగించే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే ఆగస్టు లేదా సెప్టెంబర్ లో తదుపరి సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే దిల్‌ రాజు బ్యానర్‌ లో శంకర్ దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది. అధికారిక ప్రకటన కూడా రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. దాంతో చరణ్‌ మరియు శంకర్‌ ల కాంబోను ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా పట్టాలెక్కించాలని దిల్‌ రాజు కూడా భావిస్తున్నాడు.

శంకర్ మాత్రం లైకా వారి కేసు కారణంగా జుట్టు పీక్కుంటున్నాడు. చరణ్‌ తో సినిమా విషయంలో ఆయన ఇప్పటికి ఊగిసలాటలోనే ఉన్నాడు. చరణ్‌ స్క్రిప్ట్‌ ఫైనల్‌ చేద్దామంటూ మళ్లీ మళ్లీ సందేశం పంపిస్తూ ఉన్నా కూడా శంకర్ మాత్రం వాయిదా వేస్తూ వచ్చాడు. తాజాగా మరోసారి చరణ్‌ ను శంకర్‌ వారం సమయం అడిగినట్లుగా తెలుస్తోంది. వారం రోజుల్లో ఒక స్పష్టమైన క్లారిటీ ఇచేద్దాం అంటూ సూచించాడట. వారం తర్వాత శంకర్ నుండి ఎలాంటి ప్రకటన వస్తుందా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.