అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమా చిత్రీకణకు రంగం సిద్దం అయ్యింది. కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కబోతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో కీలక పాత్రకు గాను మోహన్ లాల్ ను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన దాదాపుగా ఓకే అన్నాడు. కాని షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఆయన డేట్లు క్లాష్ అయ్యాయట. దాంతో ఆయన తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
మోహన్ లాల్ తప్పుకోవడంతో ఆ పాత్రకు గాను మమ్ముట్టిని ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. మలయాళ మెగస్టార్ గా పేరున్న మమ్ముట్టీ ఇప్పటికే తెలుగులో యాత్ర సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అలాంటి స్టార్ తెలుగులో మరో సినిమా ను చేయడం వల్ల కచ్చితంగా ఆ సినిమా బజ్ మరింత పెరగడం ఖాయం. అందుకే ఆయన ఎంట్రీతో ఏంజెంట్ మరింతగా క్రేజ్ ను సంపాదించుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఏజెంట్ సినిమాను వచ్చే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.