ఆర్ ఆర్ ఆర్ సాంగ్ షూట్ పై లేటెస్ట్ అప్డేట్

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. హిస్టారిక్ ఈవెంట్స్ కు కల్పన జోడించి ఆర్ ఆర్ ఆర్ కథను సిద్ధం చేసారు.

రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ టీం షూటింగ్ పై అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుందని తెలిపింది. అలాగే రెండు భాషలకు ఎన్టీఆర్, చరణ్ లు డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్లు తెలిపారు.

ఇక తాజా సమాచారం ప్రకారం రెండు పాటల్లో ఒకటి రామ్ చరణ్, అలియా భట్ లపై చిత్రీకరిస్తారని సమాచారం. భారీ సెట్స్ తో గ్రాండ్ విజువల్ వండర్ గా ఈ మెలోడీ సాంగ్ ఉండబోతోందిట. ఈ ఒక్క సాంగ్ తీయడానికే రెండు వారాల సమయం కేటాయించినట్లు సమాచారం.