రానా దగ్గుబాటికి ప్యాన్ ఇండియా లెవెల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. తనకు బాలీవుడ్ కాంటాక్ట్స్ కూడా బాగా ఉన్నాయి. బాహుబలిని హిందీలో ప్రమోట్ చేయడానికి రానా చాలా ఉపయోగపడ్డాడు. కరణ్ జోహార్ బాహుబలితో పార్ట్నర్ అవ్వడానికి రానా హెల్ప్ అయ్యాడు.
ఇదిలా ఉంటె రానా దగ్గుబాటి రీసెంట్ గా ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ తో భారీ డీల్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ లో భాగంగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కోసం పలు వెబ్ సిరీస్ లను, సినిమాలను నిర్మిస్తుంది.
ఇదే పద్దతిని కరణ్ జోహార్ మొదలుపెట్టాడు. నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది ధర్మ ప్రొడక్షన్స్. సురేష్ ప్రొడక్షన్స్ కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ డీల్ కాకుండా రానా దగ్గుబాటి నటించిన విరాటపర్వం కూడా నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానుంది.