‘క్యాలీఫ్లవర్’ థీమ్ పోస్టర్: అసెంబ్లీ ఎదుట నగ్నంగా నిలబడిన బర్నింగ్ స్టార్..!

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్’. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. ఇందులో సంపూ సరసన వాసంతి హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్కే మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గూడురు శ్రీధర్ సమర్పణలో మధుసూధన క్రియేషన్స్ – రాధాకృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పోస్టర్స్ కి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా ఇంట్రెస్టింగ్ ‘క్యాలీఫ్లవర్’ టైటిల్ థీమ్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

క్యాలీఫ్లవర్’ చిత్రంలో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఇంగ్లీష్ మ్యాన్ గా సంపూర్ణేష్ బాబు కనిపించనున్న విషయం తెలిసిందే. ఈరోజు రిలీజ్ చేసిన థీమ్ పోస్టర్ లో సంపూ ఏకంగా అసెంబ్లీ ముందే నగ్నంగా ధర్నాకు దిగినట్లు కనిపిస్తోంది. బర్నింగ్ స్టార్ ఎలాంటి దుస్తులు లేకుండా కేవలం క్యాలీఫ్లవర్ ని అడ్డుపెట్టుకుని నగ్నంగా నిలబడిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ‘శీలో రక్షతి రక్షితః’ అనే ట్యాగ్ లైన్ ని బట్టి చూస్తే సంపూ తన శీలాన్ని కాపాడుకోవడం కోసమే ఈ ధర్నాకు దిగినట్లు సందేహం కలుగుతోంది. అయితే సంపూ కి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియచెప్పే సన్నివేశం ఈ సినిమాకు మేజర్ హైలెట్ గా ఉండబోతుందని చిత్ర బృందం చెబుతోంది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘క్యాలీఫ్లవర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి – పృథ్వీ – నాగ మహేష్ – గెటప్ శ్రీను – రోహిణి – కాదంబరి కిరణ్ – కల్లు కృష్ణారావు – విజయ్ – కళ్యాణి – సుమన్ మన్వాడ్ – ముస్కాన్ – బేబీ సహ్రుదా – రమణ్ దీప్ కౌర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రజ్వల్ క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి బాబు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.