యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ హోస్ట్ గా మరోసారి మారిన విషయం తెల్సిందే. ఎవరు మీలో కోటీశ్వరులు షో ను హోస్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ కార్యక్రమ షూటింగ్ జరుగుతోంది. మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విచ్చేసినట్లు సమాచారం.
ఎవరు మీలో కోటీశ్వరులు కౌన్ బనేగా క్రోర్‌పతి కార్యక్రమానికి తెలుగు వెర్షన్ గా రూపొందుతోంది. రామ్ చరణ్ షో కు రావడం అధికారికమే అయినా ఈ షో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది అన్నది క్లారిటీ లేదు. ఇప్పుడు దీనిపై వార్త బయటకు వచ్చింది.
ఆగస్ట్ 15న ఎవరు మీలో కోటీశ్వరులు షో మొదటి ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది అని ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ దాదాపు 10 కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది.