రానా తమ్ముడి సినిమాలో ఆర్ఆర్ఆర్ స్టార్

దగ్గుబాటి ఫ్యామిలీ నుండి హీరోగా అభిరామ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈయన ఎంట్రీ గురించి గత మూడు నాలుగు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈయన సినిమా కన్ఫర్మ్ అయ్యింది. సురేష్ బాబు పెద్దబ్బాయి రానా ఇప్పటికే హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆయన తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా పరిచయం అయ్యి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సిద్దం అయ్యాడు. అభిరామ్ సినిమా గురించి ఎక్కువగా ప్రచారం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. తేజ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.

తాజాగా ఈ సినిమా కోసం సీనియర్ స్టార్ నటుడు కమ్ డైరెక్టర్ సముద్ర ఖనిని సంప్రదించారట. ఈమద్య కాలంలో ఈయన తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అల వైకుంటపురంలో సినిమా లో ఈయన చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇక ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్నాడు. కనుక సముద్ర ఖని వల్ల సినిమాకు వెయిట్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమా కు గాను ఆయన్ను ఎంపిక చేశారనే వార్తలు వస్తున్నాయి.

అభిరామ్ సినిమా కు తేజ దర్శకత్వం వహిస్తూ ఉండగా సంగీతాన్ని ఆర్పీ పట్నాయక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా ను సైలెంట్ గా ముగించేస్తున్నారు. ఒక మ్యూజికల్ హిట్ గా కమర్షియల్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు తేజ రూపొందిస్తున్నాడు అంటూ సురేష్ ప్రొడక్షన్స్ వారు అంటున్నారు. ఈ సినిమా ను వచ్చే ఏడాదికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారేమో చూడాలి. రానా తో తేజ తెరకెక్కించిన సినిమా నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక రానా తమ్ముడుకు కూడా తేజ సక్సెస్ ఇస్తాడని అంతా నమ్మకంగా ఉన్నారు.