సచిన్‌ కూతురు హీరోయిన్‌ అవ్వబోతుందా?

క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్‌ కు ఇద్దరు పిల్లలు. కొడుకు ఇప్పటికే క్రికెటర్‌ గా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ముంబయి ఇండియన్స్‌ జట్టులో ఆడుతున్నాడు. ఇక సచిన్‌ కూతురు సారా టెండూల్కర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. ఆమె చదువు పూర్తి చేశారు. రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేస్తూ ఉండే సారా టెండూల్కర్‌ ను హీరోయిన్‌ గా పరిచయం అవ్వాలని చాలా మంది సూచిస్తూ ఉంటారు.

తాజాగా మరోసారి సారా టెండూల్కర్‌ తన హాట్ ఫొటోలను షేర్‌ చేసింది. ఆమెకు బాలీవుడ్‌ లో మంచి పరిచయాలు ఉన్నాయి. కనుక ఆమె ముందు ముందు బాలీవుడ్‌ ద్వారా తెరంగేట్రం చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ టాక్ వినిపిస్తుంది. సచిన్ టెండూల్కర్‌ క్రికెట్‌ లో రారాజు. ఆయన కూతురు ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఓ రేంజ్ లో అంచనాలు ఉంటాయి. సినిమా హీరోల కూతుర్లు మాత్రమే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు క్రికెటర్‌ కూతురు హీరోయిన్‌ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.