భారీ ధరకు అమ్ముడుపోయిన సర్కారు వారి పాట ఆడియో రైట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట చిత్రంపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెల్సిందే. వరసగా సక్సెస్ లతో ఊపుమీదున్న మహేష్ చేస్తోన్న చిత్రం కావడంతో బజ్ చాలానే ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రేపు అంటే జులై 31న సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ ను సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. సర్కారు వారి పాట ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. సరిగమ సౌత్ సంస్థ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. రికార్డ్ ధర ఈ రైట్స్ పలికినట్లు తెలుస్తోంది.

పరశురామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.