విలన్ డెన్ కోసం కష్టపడుతోన్న సలార్ టీమ్


రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఒకదాని తర్వాత మరొక సినిమా షెడ్యూల్స్ తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసిన ప్రభాస్, ప్రాజెక్ట్ కె కు మినీ షెడ్యూల్ ను పూర్తి చేసాడు. త్వరలోనే సలార్ షూటింగ్ తిరిగి ప్రారంభవుతోంది.

మూడు వారాల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. సలార్ ఆర్ట్ వర్క్ టీమ్ ప్రస్తుతం ఈ షెడ్యూల్ కోసం విలన్ డెన్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. ఇందులోనే కీలకమైన సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఈ సెట్ ను పలు విధాలుగా చిత్ర టీమ్ షూటింగ్ కోసం ఉపయోగించుకోనుంది.

సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా హోంబేలె ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్ 14, 2022న సలార్ విడుదల కానున్నట్లు ప్రకటించిన విషయం తెల్సిందే.