నాని గ్యాంగ్ లీడర్ వల్లే కార్తికేయకు ఆ బిగ్ ఛాన్స్


నాని హీరోగా వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో ఆర్ ఎక్స్ 100 హీరో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో కార్తికేయ పాత్ర కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రేసర్ పాత్రలో కార్తికేయ నటించి మెప్పించాడు. ఆ సినిమాలో రేసర్ గా నటించి మెప్పించిన కారణంగానే ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమా వాలిమై ఛాన్స్ ను దక్కించుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వాలిమై సినిమా రేస్ లు కార్ చేజింగ్ ల చుట్టు తిరుగుతుందట. కథ విషయంలో ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి. కథ సంగతి పక్కన పెడితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అజిత్ మరియు దర్శకుడు వినోద్ లు నాని గ్యాంగ్ లీడర్ సినిమా లో కార్తికేయ పాత్ర గురించి తెలుసుకుని చూసిన తర్వాత తమ సినిమాలో ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది.

ఈమద్య కాలంలో అజిత్ సినిమాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ దక్కడం లేదు. తెలుగు లో గుర్తింపు ఉన్న యంగ్ హీరో కార్తికేయను వాలిమై లో నటింపజేస్తే ఖచ్చితంగా మంచి మార్కెట్ ఉంటుందని కూడా యూనిట్ సభ్యులు భావించారని తెలుస్తోంది. అజిత్ తో పాటు కార్తికేయ పోటీ పడి నటించాడంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తమిళంలో సూపర్ స్టార్ అయిన అజిత్ మరియు యంగ్ హీరో కార్తికేయల కాంబో సన్నివేశాలు తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

కార్తికేయ ఒక వైపు తెలుగు వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చిన మంచి అవకాశాలను వినియోగించుకుంటూ నటుడిగా తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే చేస్తాను అంటూ మడి కట్టుకుని ఉండకుండా కార్తికేయ చేస్తున్న ఈ ప్రయత్నాలను అభినందించాల్సిందే. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్న కార్తికేయ మళ్లీ అజిత్ వాలిమై సినిమాలో కూడా తప్పకుండా మంచి నటనతో మెప్పిస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది. వాలిమై సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇదే ఏడాదిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.