మహేష్, జక్కన్న ప్రాజెక్ట్ పై కీలక అప్డేట్ ఇదే!

సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఎప్పటినుండో ప్రచారం నడుస్తోంది. గతేడాది నుండి రాజమౌళి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత కచ్చితంగా మహేష్ తో చేస్తానని అన్నాడు రాజమౌళి. మహేష్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు.

ఇక రాజమౌళి సినిమాలకు కథలను అందించే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా మహేష్ కోసం కథ సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. సీనియర్ నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఈ ప్రాజెక్ట్ లో మహేష్ తో పాటు మరో హీరో కూడా నటించనున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ నుండి టాప్ హీరో ఈ సినిమాలో మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటాడని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ విడుదలైన తర్వాత జక్కన్న దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చు.