ఫొటోటాక్ : బాత్ రూమ్ లో బోల్డ్ సెల్ఫీ

అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ రోజు రోజుకు హద్దులు దాటుతూ శృతి మించుతున్నారు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్క బాలీవుడ్ హీరోయిన్ కూడా సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో తమ అందాల వింధు ఫొటో షూట్ ను షేర్ చేస్తు ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని షేర్ చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భలే ఉందే అందం అన్నట్లుగా ఈ అమ్మడిని కామెంట్స్ చేస్తున్న వారు కొన్ని వేలు.. లక్షల మంది ఉన్నారు.

ఫేస్ చూపించకుండా కేవలం నడుము చూపిస్తూ ఉన్న దిశా పటానీ ఫొటో చాలా స్పెషల్ గా ఉంది. గతంలో చాలా సార్లు హాట్ ఫొటో షూట్ మరియు స్కిన్ షో లతో రెచ్చి పోయిన దిశా పటానీ ఈసారి మాత్రం స్పోర్ట్స్ బ్రా లో నడుము నాభి చూపిస్తూ చాలా స్టైల్ గా సెల్ఫీని తీసుకుంది. ఈ బాత్ రూమ్ సెల్ఫీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అమ్మడి ఫాలోవర్స్ ఈ ఫొటో కు ఫిదా అవుతున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అభిమానులను ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు హాట్ ఫొటో షూట్ ను షేర్ చేస్తున్న దిశా పటానీకి ఈ దెబ్బతో మరింతగా ఫాలోవర్స్ పెరుగుతారేమో.

ఇక ఈ అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగు లో లోఫర్ తో పరిచయం అయ్యింది. కాని ఆ తర్వాత తెలుగు లో ఈమె సినిమాలు ఏమీ చేయలేదు. కాని బాలీవుడ్ లో మాత్రం ప్రస్తుతం ఈ అమ్మడు ఫుల్ బిజీ హీరోయిన్ గా దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈమె రెండు సినిమాల్లో నటిస్తుంది. ఆ సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. ఇక మరో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో తో ఈమె ప్రేమలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. వరుసగా సినిమాలు చేస్తున్న దిశా పటానీ పెళ్లికి కాస్త సమయం తీసుకుంటుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.