కత్రినాకైఫ్-విక్కీ కౌశల్ మధ్య ప్రేమాయణం మరోసారి బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ఇద్దరు రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడ్డాయి. ఇరు కుటుంబాల సమక్షంలో సింపుల్ గా ఈ వేడుక జగిరిపోయిందని ప్రచారం సాగింది. పెళ్లికి మంచి ముహూర్తం చూసుకోవడమే ఆలస్యం అంటూ జాతీయ మీడియాలో హైలైట్ అయింది. బ్యాచిలర్ లైఫ్ కి కత్రినా పుల్ స్టాప్ పెట్టి.. కొత్త జీవితంలో అడుగుపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం సాగింది.
ఇంతకీ కత్రిన పెళ్లి కబర్ లో వాస్తవమెంత? నిజంగా విక్కీ-కత్రినా మధ్య ఎంగేజ్ మెంట్ జరిగిందా? అంటే ఇది పుకారు మాత్రమేనని కత్రినా సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఇది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమేనని.. ఈ జంటకు ఎంగేజ్ మెంట్ జరగలేదని చెబుతున్నారు. కానీ ఈ సీన్ లోకి ఇప్పటిరవకూ కత్రినా గానీ- విక్కీగాని ఎంటర్ అవ్వలేదు. వాళ్లు..వీళ్లు చెప్పడం తప్ప అసలు వాళ్లెవ్వరూ స్పందించలేదు. దీంతో ఈ పెళ్లి వ్యవహారం మరోసారి సస్పెన్స్ లో పడింది. అయితే పెళ్లి వార్తలతో కత్రినా దీర్ఘ కాలిక ప్రణాళికలకు కొంత ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు. అందుకే సన్నిహితుల నుంచి కత్రిన వివరణ ఇచ్చి ఉండొచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. కత్రినా ఇప్పటికే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్.. రణబీర్ కపూర్ లతో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే.
రణబీర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడే పెళ్లి పీఠలు ఎక్కడానికి కత్రిన సిద్ద పడింది. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి. ఇంతలోనే ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో ఆ బంధం అక్కడితో వీగిపోయింది. ఆ వెంటనే రణబీర్ అలియా భట్ ప్రేమలో పడటం.. కత్రినా విక్కీ కౌశల్ తో నిండా డేటింగ్ లో మునగడం తెలిసినదే. తాజాగా వస్తోన్న కథనాల్ని బట్టి కత్రిన లేటెస్ట్ ప్రేమ కహానీకి కూడా డేటింగ్ తోనే ఎండ్ కార్డ్ పడుతుందేమో.. అంటూ ఒక సెక్షన్ సందేహాలు వ్యక్తం చేస్తోంది.