చెయ్ నువ్ ఎంజాయ్ చేయ్ మావా.. నువ్ చేస్తే చూస్తా!

మగువల్ని ఇతరులు చూసే పంథా వేరు. ఆర్జీవీ చూసే తీరు వేరు! ఆయన లెన్స్ మరీ స్పైసీ.. అడ్డూ అదుపూ లేనిది. మగువ సొగసును చూడగానే తనువు ఎంతగా పిలకించిపోతుందే చెప్పేందుకు ఆయన తపిస్తున్న తీరు ఇటీవల సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే పలువురు యాంకర్లను కథానాయికలుగా ప్రమోట్ చేసేందుకు ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూలతో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఇంతకుముందు అరియానాతో ఇప్పుడు అషురెడ్డితో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూలు సంచలనంగా మారాయి. ఇద్దరు బిగ్ బాస్ బ్యూటీస్ ని వెండితెరపై ప్రమోట్ చేసే బాధ్యతను ఆర్జీవీ తీసుకున్నారు. ఆ ఇద్దరు భామలతో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూల్లో సిగ్గులేని ప్రశ్నల గురించి అంతటా చర్చ సాగుతోంది. ఇక అతడు ఒకడుగు ముందుకు వేసి `నీ తొడ అందాలు సూపర్భ్!` అనేశాడు. అషురెడ్డి చెంపదెబ్బను కానుకిచ్చింది. అయినా మారని ఆర్జీవీ నాతో కలిసి పోర్న్ చూస్తావా? అని కూడా అడిగాడు. ఓవరాల్ గా ఈ బోల్డ్ ఇంటర్వ్యూని వీక్షించిన అషురెడ్డి తల్లి గారు కూడా ఏమాత్రం జంకకుండా ఆర్జీవీకి కితాబిచ్చేశారు.

ఇప్పుడు ఇదే ఊపులో ఆర్జీవీ పబ్బుల్లో క్లబ్బుల్లోనే నైట్ పార్టీలతో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. తన డీకంపెనీ కథానాయికలతో బీర్ వోడ్కా తాగుతూ చిలౌట్ చేస్తున్నారు. తాజాగా అంకిత రాణా అలియాస్ అప్సర రాణీతో కలిసి బీర్ తాగుతూ ప్రత్యక్షమయ్యారు. “బీస్ట్ అండ్ ది బ్యూటీ! 300 బీర్ చీర్స్ ఫ్రం…“ అంటూ ఒక బ్రూవరీ కంపెనీకి యాండ్ క్యాంపెయినింగ్ కూడా చేశారు ఆర్జీవీ. “చెయ్ నువ్ ఎంజాయ్ చేయ్ మావా .. నువ్వు ఎంజాయ్ చేస్తే చూడాలని ఉంది!“ అంటూ ఓ అభిమాని దానికి రిప్లయ్ కూడా ఇచ్చారు. మొత్తానికి ఆర్జీవీని చూసి కుళ్లుకునే వారి జాబితా అంతకంతకు పెరుగుతోందనేందుకు ఈ ఫోటోకి వచ్చిన వందలాది స్పందన మెసేజ్ లే సాక్ష్యం.