బికినీ వేస్తే విడాకులు ఎప్పుడు అంటున్నారు

లేడీ కమెడియన్ గా మంచి పేరు దక్కించుకున్న విధ్యు లేఖ రామన్ ఇటీవలే ప్రియుడితో పెళ్లి పీఠలు ఎక్కింది. పెళ్లి కార్యక్రమాలు మొదలు అయినప్పటి నుండి ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఆమె కనిపిస్తుంది. కోరుకున్న వ్యక్తితో కోరుకున్న విధంగా పెళ్లి జరిగినందుకు ఆమె ఆనందంకు అవధులు లేవు. తమను అర్థం చేసుకుని పూర్తి స్వేచ్చ ఇచ్చే వ్యక్తి భర్తగా రావాలని అంతా అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి విద్యు రామన్ కు వచ్చాడట. ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. తాజాగా తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న బ్యాడ్‌ కామెంట్స గురించి మాట్లాడింది.

ఇటీవల కొందరు విడాకులు ఎప్పుడు తీసుకుంటావు అంటూ ప్రశ్నించారట. ఆ ప్రశ్న ఆమెకు బాధను కలిగించిందట. బికినీ వేసుకున్నంత మాత్రాన విడాకులు తీసుకుంటారా.. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి డ్రస్ లు వేసుకోకూడదు అని ఏమైనా రూల్‌ ఉందా అంటూ ఆమె ప్రశ్నించింది. ఇంకా చాలా మంది అంకుల్స్ 1920 లోనే ఉన్నారు. వారు బయటకు రాకుంటే వారే బాధ పడుతారు. అక్కడ నుండి బయటకు వచ్చి పాజిటివ్‌ గా ఆలోచించాల్సిందిగా నెటిజన్స్ సూచిస్తున్నారు.