సూపర్ స్టార్ రజినీకాంత్ కూతుర్లు ఇద్దరు కూడా ఫిల్మ్ మేకర్స్ అనే విషయం తెల్సిందే. రజినీకాంత్ కూతుర్లలో ఒక కూతురు అయిన ఐశ్వర్య ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలను తెరకెక్కించారు. ఒక డాక్యుమెంటరీని కూడా రూపొందించారు. సినిమా ఇండస్ట్రీలో దర్శకురాలిగా స్టార్ డమ్ దక్కించుకునేందుకు గాను ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుకు గాను ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. అది కూడా ఒక చిన్నా చితకా మూవీ కాకుండా స్టార్ హీరోలతో తెలుగు లో ఎంట్రీ ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. వందల కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ లో ఆ మూవీ ఉండబోతుందనే వార్తలు జోరుగా వస్తున్నాయి. తెలుగు లో సినిమాలు చేయడం వల్ల పాన్ ఇండియా గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఆమె భర్త ధనుష్ తెలుగు సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. అది ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సమయంలోనే ఐశ్వర్య కూడా దర్శకురాలిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు కనుక చిన్న సినిమా లతో కాకుండా ఏకంగా మెగా సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. మెగా హీరోలు ఇద్దరితో తన టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని ఆమె సన్నిహితుల వద్ద అన్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో వార్తలు గుప్పుమంటున్నారు. అది కూడా రామ్ చరణ్ ఒక హీరోగా నటించబోతున్నట్లుగా చెబుతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఆ సినిమాను పట్టాలెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారట. లైకా ప్రొడక్షన్స్ వారు ఇద్దరు స్టార్ హీరోలతో పాటు ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ను మరియు భారీ మొత్తంలో ఖర్చు చేసి సినిమాను రూపొందించి భారీ పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని భావిస్తున్నారట. కొన్నాళ్లుగా లైకా ప్రొడక్షన్స్ వారు కాస్త సైలెంట్ అయ్యారు అనిపించింది. మళ్లీ వారు ఈ పాన్ ఇండియా సినిమాతో ఆల్ ఇండియా రేంజ్ లో తమ బ్యానర్ ను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
ధనుష్ మరియు ఐశ్వర్యలు ఒకేసారి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నం కాకతాళీయం అయినా కూడా తమిళ ఇండస్ట్రీ వర్గాల వారికి తెలుగు సినిమా పై ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థం అవుతోంది. వీరు మాత్రమే కాకుండా శంకర్.. లింగు స్వామిలు కూడా తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ సినిమాలు మొదలు అయ్యాయి. ఇక విజయ్ మరియు శివ కార్తికేయన్ లు కూడా తెలుగు సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇంకా కొందరు తమిళ స్టార్స్ మరియు దర్శకులు కూడా టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. మల్టీ ల్యాంగేజ్ సినిమాలు చేసి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం ద్వారా తమ తమిళ సినిమాలకు కూడా మంచి మార్కెట్ వస్తుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అంటూ సమాచారం అందుతోంది.
ఏది ఏమైనా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ టాలీవుడ్ ఎంట్రీ గురించి బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కాకుండా మెగా మల్టీ స్టారర్ అంటూ ప్రచారం జరుగుతోంది. కనుక ఆమె ఎంట్రీ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మెగా మల్టీ స్టారర్ లో రజినీకాంత్ చిన్న గెస్ట్ రోల్ చేసినా కూడా అది అదిరి పోతుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఐశ్వర్య ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. లైకా వారు ఈ సినిమా ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్నారు.